భారత్, చైనా దళాలు వాస్తవాధీన రేఖ వద్ద అతి త్వరలోనే గస్తీ మొదలు పెట్టనున్నాయని కేంద్రమంత్రి జైశంకర్ వెల్లడించారు. ముంబైలో జరిగిన ప్రెస్కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. ‘2020 నాటికి ముందు పరిస్థితి వస్తుందని ఆశిస్తున్నాను. దెమ్చోక్, దెప్సాంగ్ వద్ద అప్పటి గస్తీ ఏర్పాటు పునరుద్ధరిస్తారని భావిస్తున్నా. దీనికి కొంత సమయం పట్టొచ్చు’ అని పేర్కొన్నారు. భవిష్యత్తు చర్చల్లో సరిహద్దుల నిర్వహణపై మాట్లాడుతామన్నారు.