ప్రకాశం: కనిగిరి పట్టణంలో ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి చొరవతో విద్యుత్ స్తంభాల స్థానంలో నూతన విద్యుత్ టవర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఆదివారం పట్టణంలోని వైఎస్సార్ రోడ్డు నందు ఏర్పాటు చేస్తున్న విద్యుత్ టవర్లను మున్సిపల్ ఛైర్మన్ అబ్దుల్ గఫార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టవర్ల ఏర్పాటు పనులను నాణ్యతతో చేయాలని విద్యుత్ శాఖ అధికారులకు సూచించారు.