దీపావళి పండుగ వేళ దేశవ్యాప్తంగా రైల్వేస్టేషన్లలో రద్దీ నెలకొంది. సొంతూళ్లలో వెళ్లడానికి ప్రయాణికులు పోటెత్తారు. ఈ క్రమంలో ముంబైలోని బాంద్రా రైల్వేస్టేషన్లో తొస్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 9 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. బాంద్రా నుంచి గోరఖ్పూర్ వెళ్తుతున్న ఈ రైలులో ప్రయాణికులు అధికంగా ఉండటంతో తొక్కిసలాట జరిగినట్లు అధికారులు వెల్లడించారు.