ATP: గుత్తి పట్టణంలోని జంగాల కాలనీలో రోడ్డు మధ్యలో డస్ట్ బిన్లో చెత్త పేరుకుపోయి దుర్వాసన వస్తుందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. గత మూడు రోజులుగా చెత్తను తరలించకపోవడంతో దుర్వాసన వెదజల్లుతుందని, రాత్రి సమయాలలో దోమల బెడద ఎక్కువ ఉందన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చెత్తను తరలించి దోమల నివారణ మందును పిచికారి చేయాలన్నారు.