W.G: పాలకొల్లులో తన కార్యాలయం వద్ద ఆదివారం 11 మందికి సీఎం సహాయనిధి కింద రూ.3.20 లక్షల చెక్కులను మంత్రి నిమ్మల రామానాయుడు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఎన్డీఏ ప్రభుత్వంలో నిరుపేదలైన రోగుల వైద్యానికి పెద్దపీట వేస్తున్నామని, గత ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించకుండా ఎగ్గొట్టిందన్నారు.