సీనియర్ నటి సుహాసిని తాజా సినిమాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమాల్లో మహిళలను చూపించే తీరు ఏ విధంగా మారిందో వెల్లడించారు. కమర్షియల్ చిత్రాలకు సబందించి 2010 నుంచి అనేక మార్పులు వచ్చాయన్నారు. మోడ్రన్ పోకడ ఎక్కువయిందని, ఈ క్రమంలో స్కిన్ షో, ఇంటిమేట్ సీన్స్‌లో నటించడానికి ఏమాత్రం ఇబ్బంది పడటం లేదన్నారు. భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో మహిళలను తక్కువ చేసి చూపిస్తున్నారని పేర్కొన్నారు.