ప్రకాశం: పంగులూరులో ఆదివారం నిర్వహించిన కంటి వైద్య శిబిరానికి 61 మంది హాజరైనట్లు క్లబ్ క్యాంప్ ఛైర్మన్ చిలుకూరు వీర రాఘవయ్య తెలిపారు. వీరిలో 45 మందికి కంటి శుక్లముల ఆపరేషన్లు చేయాలని వైద్యులు నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఋతుజ, శంకర్ కంటి వైద్యశాల సిబ్బంది, క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు షేక్ కాలేశావళి, క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.