ATP: పామిడి మండలం పాళ్యం గ్రామంలో టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీపీ నారాయణస్వామి ఆదివారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం వారి స్వగ్రామానికి వెళ్లి నారాయణస్వామి భౌతికాయానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ సంతాపం వ్యక్తం చేశారు.