కృష్ణా: కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీ పేరుతో మోసం చేసిందని, నిరుద్యోగ యువత ఆశలపై కూటమి ప్రభుత్వం నీరు చల్లిందని వైసీపీ నేత గౌతమ్ రెడ్డి విమర్శించారు. విజయవాడలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. అర్జీ ఫౌండేషన్, సాయిబాబా నిత్యాన్నదాన కమిటీ ఆధ్వర్యంలో డీఎస్సీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.