SDPT: బాణాసంచా విక్రయాలకు అనుమతి తప్పనిసరని సిద్దిపేట పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ అన్నారు. దీపావళికి భద్రతా ప్రమాణాలు పాటించాలని, ప్రజల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని రాబోయే దీపావళిని ప్రజలందరూ సంతోషంగా జరుపుకోవాలన్నారు. అనుమతులు లేకుండా బాణాసంచా దుకాణాలను ఏర్పాటు చేస్తే పేలుడు పదార్థాల చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.