TG: స్థిరాస్తి వ్యాపారం కోసమే కాంగ్రెస్ మూసీ పునరుజ్జీవం చేపట్టిందని మాజీమంత్రి KTR విమర్శించారు. ‘BRS హయాంలోనే HYD మురుగు నీటి శుద్ధికి సుమారు 4వేల కోట్లు కేటాయించాం. మేము బ్యూటిఫికేషన్‌కు కాదు.. లూటిఫికేషన్‌కే వ్యతిరేకం. KCR ఎప్పుడో మూసీ పనులు మొదలు పెట్టారు. కొత్తగా చేయాల్సింది ఏమీ లేదు. ఏ పథకం అమలు చేయాలన్నా ప్రభుత్వం వద్ద పైసలు లేవని మంత్రులు అంటున్నారు. మూసీకి రూ.లక్షన్నర కోట్లు ఎక్కడివి’ అని ప్రశ్నించారు.