భోజనం తర్వాత మనం చేసే కొన్ని తప్పులు అనారోగ్య సమస్యలను తెచ్చిపెడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తిన్నాక ధూమపానం చేసినా, మద్యం సేవించినా జీర్ణవ్యవస్థపై ప్రభావం పడుతుంది. క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది. భోజనం తర్వాత టీ తాగితే అజీర్తి సమస్యలు వస్తాయి. ఎక్కువ నీటిని తాగితే పొట్టలోని ఆమ్లాలు కరిగిపోతాయి. ఆహారం తిన్న వెంటనే స్నానం చేస్తే జీర్ణక్రియ దెబ్బతింటుంది. నిద్రపోతే గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి.