తాను చనిపోయినట్లు చాలా సందర్భాల్లో వార్తలు వచ్చాయని బాలీవుడ్ సీనియర్ నటి కాజోల్ చెప్పారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ.. తనపై వచ్చిన వార్తలను చూసి షాకయ్యానని తెలిపారు. ఒకానొక సమయంలో గుర్తు తెలియని వ్యక్తి వాళ్ల అమ్మకు కాల్ చేసి.. విమాన ప్రమాదంలో తాను చనిపోయినట్లు చెప్పాడని, అప్పుడు ఇంట్లో వారు కంగారుపడ్డారని పేర్కొన్నారు. ఇలాంటి వార్తలను ఎలా రాస్తారని అప్పుడప్పుడు అనిపిస్తుందని అభిప్రాయపడ్డారు.