ATP: గుంతకల్లు మండలం కసాపురం గ్రామంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో ఆదివారం గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం కుటుంబ సభ్యులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయ అధికారులు ఎమ్మెల్యేను స్వాగతం పలికారు. ఆలయంలో ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల పేరు మీద ప్రత్యేక పూజలు చేశారు.