దేశీయ ఈక్విటీల్లో విదేశీ సంస్థాగత మదుపర్లు(FPIs) పెట్టుబడులను క్రమంగా తగ్గించుకుంటున్నారు. అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల కారణంగా ఈ నెలలో భారీగా విక్రయాలు జరిపినట్లు NSDL డేటా వెల్లడించింది. ఈ నెల 1 నుంచి 25వ తేదీ మధ్య FPIs రూ.85,790 కోట్లను వెనక్కి తీసుకున్నారు. దీంతో పెట్టుబడుల ఉపసంహరణ 10 నెలల గరిష్టానికి చేరింది. చైనాలో ఉద్దీపన ప్యాకేజీ ప్రకటన, అంతర్జాతీయ రాజకీయ సంక్షోభం పెట్టుబడులపై ప్రభావం చూపుతోంది.