TG: KTR బావమరిది ఫాంహౌస్లో రేవ్ పార్టీపై సుద్దపూస.. ఇప్పుడేమంటాడో అంటూ కేంద్రమంత్రి బండి సంజయ్ విమర్శించారు. ‘డ్రగ్స్ తీసుకుంటూ అడ్డంగా దొరికినా బుకాయిస్తాడేమో. సుద్దపూసను కావాలనే తప్పించారనే వార్తలొస్తున్నాయి. కాంగ్రెస్, BRS కాంప్రమైజ్ పొలిటిక్స్ సిగ్గు చేటు. రేవ్ పార్టీ సంఘటనపై విచారణ జరపాలి. ఆధారాలు ధ్వంసం కాకుండా చూడాలి. చట్టం ముందు అందరూ సమానమేనని.. నిరూపించేలా నిందితులపై చర్యలుండాలి’ అని డిమాండ్ చేశారు.