విక్టరీ వెంకటేష్ హీరోగా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తోన్న సినిమా ‘SVC 58’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతోన్న ఈ సినిమా నుంచి సాలిడ్ అప్డేట్ వచ్చింది. ఈ సినిమా షూటింగ్ 90% పూర్తయినట్లు మేకర్స్ వెల్లడించారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. మూవీ డబ్బింగ్ పనులు కూడా ప్రారంభమైనట్లు, త్వరలో ఫస్ట్ లుక్తో పాటు టైటిల్ను రివీల్ చేస్తున్నట్లు ప్రకటించారు.