నవంబర్ 26న పార్లమెంట్ ప్రత్యేక సమావేశం నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. భారత రాజ్యంగాన్ని 1949 నవంబర్ 26న ఆమోదించారు. రాజ్యంగాన్ని ఆమోదించి 75 సంవత్సరాలు పూర్తి అవుతున్న నేపథ్యంలో పార్లమెంట్లోని సెంట్రల్ హల్లో నవంబర్ 26న లోక్సభ, రాజ్యసభ ఉమ్మడి సమావేశం జరగనుందని అధికారులు వెల్లడించారు. కాగా, ప్రతి సంవత్సరం నవంబర్ 26వ తేదీని రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటారు.