‘కంగువ’ ఆడియో లాంచ్ ఈవెంట్లో హీరో సూర్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఐదేళ్ల క్రితం సోషల్ మీడియాలో ఎవరైనా నెగటివ్ కామెంట్స్ చేస్తే.. వాటిని చూసి రోలెక్స్‌లా మారిపోయేవాడినని తెలిపారు. బాగా కోపం వచ్చేదని చెప్పారు. నెగటివ్ కామెంట్స్‌కు రిప్లైలు ఇస్తూ టైంను వృథా చేసుకోవద్దని సూచించారు. కెరీర్ పరంగా అప్స్ అండ్ డౌన్స్ చూసి బాధపడటం లేదని, ఫేయిల్యూర్లను అనుభవిస్తేనే సక్సెస్‌ను ఆస్వాదించగలమని అన్నారు.