W.G: జీలుగుమిల్లి మండల కేంద్రంలో ఆదివారం ఉచిత గ్యాస్ కనెక్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి గడ్డమనుగు రవికుమార్ పాల్గొన్నారు. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (PMUY) పథకంలో మంజూరైన 110 కుటుంబ లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేశారు.