AP: తిరుమల లడ్డూ వివాదం విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సినీ నటుడు ప్రకాష్ రాజ్ మధ్య మాటల యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా పవన్‌పై ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ రాజకీయాల్లో మూర్ఖంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఆయన విధ్వంసర రాజకీయాలు చేస్తున్నారని, అది తనకు నచ్చడం లేదన్నారు. ప్రజలు పవన్‌ను ఎన్నుకున్నది మతపరంగా విడదీసి రాజకీయాలు చేయడానికి కాదని, అందుకే తాను ప్రశ్నిస్తున్నాని తెలిపారు.