TG: జన్వాడ ఫామ్‌హౌస్ పార్టీపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఫామ్‌హౌస్ చుట్టూ ఉన్న సీసీటీవీ ఫుటేజీ విడుదల చేయాలి. HYDలో విచ్చలవిడిగా డ్రగ్స్ దందా జరుగుతోంది. జన్వాడ ఫామ్‌హౌస్‌లో ఏం జరిగిందో ప్రజలకు తెలియాలి. సీఎం రేవంత్ ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు. రేవ్ పార్టీలో వీఐపీల పిల్లలున్నారని వార్తలొచ్చాయి. వాటి సంగతేంటి? కాంగ్రెస్, BRS కుమ్మక్కయ్యాయని అనుమానంగా ఉంది’ అని అన్నారు.