TG: బెటాలియన్ కానిస్టేబుళ్లు ఆందోళన చేస్తున్న వేళ మరో వివాదం వెలుగులోకి వచ్చింది. ఓ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఇంట్లోని పెళ్లికి బ్యాండ్ వాయించేందుకు మామునూరు 4వ బెటాలియన్ కానిస్టేబుళ్లకు ఆ పని అప్పగించారు. దీంతో మాజీ ఐపీఎస్ ఇంట్లో పెళ్లికి కానిస్టేబుల్స్ బ్యాండ్ వాయిస్తూ కనిపించారు. కానిస్టేబుళ్లతో బ్యాండ్ వాయించడం ఏంటని ప్రశ్నిస్తే, ఉన్నతాధికారుల నిబంధనల మేరకే ఇలా చేయిస్తున్నామని సంబంధిత అధికారులు తెలిపారు.