SKLM: రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న మహిళా హోంగార్డు తమ్మినేని రేవతిని జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి ఆదివారం పరామర్శించారు. అనంతరం మెరుగైన చికిత్స అందించాలని వైద్యాధికారులను సూచించారు. వివరాలు ప్రకారం సరుబుజ్జిలి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తించుకొని ఇంటికి వెళుతున్న క్రమంలో మార్గమధ్యలో వాహనం అదుపుతప్పడంతో ఆమె తీవ్రంగా గాయపడ్డారు.