ELR: నిడమర్రు మండలం పెదనిండ్రకొలను గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ భీమేశ్వరస్వామి వారి దేవస్థానానికి ఉత్సవ కమిటీ ఛైర్మన్గా మేకా వెంకటరమణ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఛైర్మన్, ఉత్సవ కమిటీ సభ్యులు ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, పత్సమట్ల భీమరాజు తదితరులు పాల్గొన్నారు.