చిల్లర సమస్యకు చెక్ పెట్టాలని QRకోడ్ ఆధారిత కాయిన్ వెండింగ్ మెషిన్‌ను కేరళలో ప్రారంభించారు. కోజీకోడ్లోని ఫెడరల్ బ్యాంకులో దీన్ని అందుబాటులోకి తెచ్చారు. QRకోడ్‌ను స్కాన్ చేసి నాణేలను తీసుకోవచ్చు. ఈ మెషిన్లో రూ.1, 2, 5, 10 నాణేలు అందుబాటులో ఉంటాయి. గతంలో ఉన్న మెషిన్లు నోట్లను తీసుకుని కాయిన్స్ ఇచ్చేవి. కానీ, ఈ మెషిన్ ద్వారా ఏ బ్యాంక్ ఖాతా ఉన్నా డిజిటల్ చెల్లింపుల ద్వారా చిల్లర తీసుకోవచ్చు.