CTR: కుప్పం మున్సిపాలిటీ 4వ వార్డు పరిధిలోని కతమూరులో శనివారం తెలుగుదేశం పార్టీ క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఆర్టీసీ వైస్ చైర్మన్ పీఎస్.మునిరత్నం ప్రారంభిస్తారని పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు రాజ్ కుమార్ తెలిపారు. ఉదయం 10.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు పెద్దసంఖ్యలో హాజరై విజయ వంతం చేయాలని ఆయన కోరారు.