KDP: వైవీయూ లలిత కళా విభాగం ఆధ్వర్యంలో ప్రపంచ చిత్రకారుడు పాబ్లో పికాసో జయంతిని నిర్వహించి ఆయన చిత్రాల సరళి పై వర్క్ షాప్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శాఖ విభాగాధిపతి డా.కోట మృత్యుంజయ రావు ఆధ్వర్యంలో పికాసో చిత్రాల పై డాక్యుమెంటరీ చిత్రాన్ని ప్రదర్శించారు. అనంతరం భారీ పికాసో చిత్రాన్ని విద్యార్థులు అప్పటికప్పుడు చిత్రీకరించారు.