NLG: నవంబర్ 4వతేదీన బీసీ కమిషన్ బృందం నల్గొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి వస్తున్నట్లు జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. బీసీ కమిషన్ బృందం ఉమ్మడి నల్గొండ జిల్లాలోని అన్నికులాల (SC,ST,BC,మైనార్టీ) సామాజిక, రాజకీయ, ఆర్థిక విశ్లేషణ చేస్తారని పేర్కొన్నారు. ఉదయం 10గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టడం జరుగుతుందన్నారు.