ATP: పరిశ్రమలు జిల్లా ఆర్థిక ప్రగతికి ఆయువు పట్టు అని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ అన్నారు. జిల్లాలో పారిశ్రామిక రంగాన్ని పటిష్టం చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో 51వ జిల్లా పరిశ్రమల ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సమావేశాన్ని కలెక్టర్ నిర్వహించారు.