MHBD: దంతాలపల్లి మండలంలోని రేపోని, గున్నెపల్లి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను తొర్రూరు మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ భట్టు నాయక్ ప్రారంభించారు. వైస్ ఛైర్మన్ మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాలను రైతుల సద్వినియోగం చేసుకొని మద్దతు ధరను పొందాలని, రైతులు దళారుల మాటలు నమ్మి మోసపోకూడదని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉన్నారు.