KMR: మద్నూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2017లో జరిగిన ఆవు దొంగతనం కేసులో బిచ్కుంద కోర్టు నిందితుడికి ఆరు నెలల జైలు శిక్ష విధించింది. సాక్ష్యాధారాలతో నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన అధికారులను కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర అభినందించారు. నేరస్తులకు శిక్ష తప్పదని ఈ సందర్భంగా పోలీసులు స్పష్టం చేశారు.