KDP: జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు రౌడీ షీటర్లు, నేరచరిత్ర గల వ్యక్తులకు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించారు. నేరాలకు దూరంగా ఉండాలని పోలీసులు సూచించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సత్ప్రవర్తనతో జీవిస్తూ కుటుంబంతో గౌరవప్రదమైన జీవనం గడపాలని హితవు పలికారు.