NDL: సంజామల మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త లక్ష్మీ ప్రియా సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థినిలతో సమావేశమయ్యారు. న్యూట్రీషియన్ ఎడ్యుకేషన్, అడల్ట్ ఎడ్యుకేషన్, ప్లాంటేషన్, కిచెన్ గార్డెన్ మెయింటెనెన్స్, తదితర అంశాలపై ప్రిన్సిపల్ శ్రీలేఖ ఆధ్వర్యంలో ఆమె విద్యార్థినిలకు అవగాహన కల్పించారు.