AP: యువ సాంకేతిక నిపుణులతో డ్రోన్ సదస్సు నిండిపోయిందని సీఎం చంద్రబాబు అన్నారు. అమరావతి డ్రోన్ సమ్మిట్ లాంటి కార్యక్రమం దేశంలో తొలిసారిగా జరుగుతుందని పేర్కొన్నారు. దేశంలో డ్రోన్ ఇండస్ట్రీ అభివృద్ధి చెందుతోందని తెలిపారు. డ్రోన్స్.. ఫ్యూచర్లో గేమ్ ఛేంజర్స్ అవుతాయని అన్నారు. ఐటీ, నాలెడ్జ్, ఎకానమీలో భారతీయులు చాలా సమర్థులని.. ఎప్పటికప్పుడు ఆధునిక సాంకేతికతను అందుకోవటంలో ఏపీ ముందుందని వ్యాఖ్యానించారు.