»Chandrababu Three Days Tour On Idem Kharma Mana Rashtraniki Programme
TDP అటు తండ్రి.. ఇటు కుమారుడు.. జగన్కు మూడినట్టే!
టీడీపీ చురుగ్గా కార్యక్రమాలు నిర్వహిస్తుండడంతో అధికార పార్టీకి కంటగింపు మొదలైంది. టీడీపీ కార్యక్రమాలు విజయవంతం కాకుండా అన్ని విధాల ప్రయత్నాలు చేస్తోందని తెలుగు తమ్ముళ్లు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే లోకేశ్ యాత్రపై అనేక ఆంక్షలు కొనసాగుతున్నాయి. మైక్ లాక్కోవడం.. కార్యకర్తలను రాకుండా అడ్డుకోవడం వంటి చర్యలు ఏపీ ప్రభుత్వం చేస్తోందని టీడీపీ ఆరోపిస్తుంది.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం చేస్తున్న వైఫ్యలాలు, ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాన్ని తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) తీవ్రం చేసింది. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడుతోంది. ఇప్పటికే పార్టీ యువ నాయకుడు నారా లోకేశ్ (Nara Lokesh) ‘యువగళం’ (Yuvagalam) పేరిట భారీ పాదయాత్ర చేస్తున్నాడు. ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. పార్టీ శ్రేణుల్లో జోష్ రావడంతో ఇదే ఊపును కొనసాగించేందుకు పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) రంగంలోకి దిగనున్నారు. ఇప్పటికే పలు దశల్లో జగన్ పాలనను విమర్శిస్తూ ‘ఇదేం ఖర్మ-మన రాష్ట్రానికి’ (Idhem Karma Mana Rashtraniki) అనే పేరుతో పలు నియోజకవర్గాల్లో పర్యటించారు. తాజాగా బుధవారం నుంచి మూడు రోజుల పాటు పలు చోట్ల చంద్రబాబు పర్యటించనున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ ఇలా ఉంది.
కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల్లో ఫిబ్రవరి 15, 16, 17 తేదీల్లో చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ‘ఇదేం ఖర్మ-మన రాష్ట్రానికి’ కార్యక్రమంతో జగన్ ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా వ్యతిరేక విధానాలు ప్రజల ముందు ఉంచనున్నారు. రోడ్ షోలు, బహిరంగ సభల ద్వారా వైఎస్సార్ సీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం వినిపించనున్నారు. తొలి రోజు బుధవారం జగ్గంపేట నియోజకవర్గంలో, గురువారం జగ్గంపేటతో పాటు పెద్దాపురం నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటిస్తారు. ఇక శుక్రవారం పెద్దాపురం, అనపర్తి నియోజకవర్గాల్లో చంద్రబాబు రోడ్ షో, బహిరంగ సభల్లో పాల్గొంటారు. ఈ మూడు రోజులు దాదాపు 146 కిలో మీటర్ల మేర చంద్రబాబు పర్యటన చేయనున్నారు. పార్టీ అధినేత పర్యటన కోసం కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో తొక్కిసలాట జరగడంతో అలాంటి ప్రమాదాలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోనున్నారు.
అప్రమత్తం
టీడీపీ చురుగ్గా కార్యక్రమాలు నిర్వహిస్తుండడంతో అధికార పార్టీకి కంటగింపు మొదలైంది. టీడీపీ కార్యక్రమాలు విజయవంతం కాకుండా అన్ని విధాల ప్రయత్నాలు చేస్తోందని తెలుగు తమ్ముళ్లు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే లోకేశ్ యాత్రపై అనేక ఆంక్షలు కొనసాగుతున్నాయి. మైక్ లాక్కోవడం.. కార్యకర్తలను రాకుండా అడ్డుకోవడం వంటి చర్యలు ఏపీ ప్రభుత్వం చేస్తోందని టీడీపీ ఆరోపిస్తుంది. ఇప్పుడు బాబు పర్యటనను కూడా అడ్డుకునేందుకు ఏదో ఒక ప్రయత్నం చేస్తుందని.. పార్టీ కార్యకర్తలు, నాయకులు ధైర్యంగా ఉండాలని.. ఆ కుట్రలను తిప్పికొట్టాలని పార్టీ అధిష్టానం సూచిస్తోంది.
జోష్ లో తెలుగు తమ్ముళ్లు పార్టీ అధినేత చంద్రబాబు పర్యటనతో తెలుగు తమ్ముళ్లు ఉత్సాహంతో ఉన్నారు. ఈ పర్యటనతో పాటు పార్టీ శ్రేణులకు చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు చంద్రబాబు తీవ్రంగా శ్రమిస్తుండడంతో అతడికి తోడుగా ఉంటామని టీడీపీ నాయకులు పేర్కొంటున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు పర్యటనకు ముందస్తు ఏర్పాట్లు భారీ స్థాయిలో చేశారు. అటు యువ నాయకుడు లోకేశ్ పాదయాత్రతో ప్రభుత్వం ఉలిక్కి పడగా ఇప్పుడు చంద్రబాబు పర్యటనతో తాడేపల్లికి సెగ తగిలినట్టు ఉంది. ఈ పర్యటనలను రద్దయ్యేలా, లేదా అలజడులు రేపే కుట్ర పన్నుతారని టీడీపీ వర్గాలు ఆందోళన చెందుతున్నారు. అందుకే ఈ కార్యక్రమాలను ప్రత్యేక జాగ్రత్తలతో నిర్వహిస్తున్నారు. జగ్గంపేటలో ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి, పార్టీ ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ తదితరులు దగ్గరుండి ఏర్పాట్లు చూస్తున్నారు.