సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న మూవీ ‘స్పిరిట్’. పోలీస్ యాక్షన్ కథతో రాబోతున్న ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నట్లు వార్తలొస్తున్నాయి. తాజాగా వాటిని నిజం చేస్తూ దర్శకుడు క్లారిటీ ఇచ్చారు. ఈ మూవీ పోలీస్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్నట్లు, ప్రభాస్ డేరింగ్ డాషింగ్ పోలీస్ రోల్లో కనిపిస్తారని చెప్పారు. ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.