ప్రకాశం: ఒంగోలు మండల సర్వసభ్య సమావేశం గురువారం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో రాజశేఖర్ తెలిపారు. ఈ సర్వసభ్య సమావేశం ఎంపీపీ అధ్యక్షతన జరుగుతుందని పేర్కొన్నారు. మండలంలోని ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, పంచాయతీ కార్యదర్శులు హాజరుకావాలని కోరారు. వివిధ శాఖలకు చెందిన అధికారులు పూర్తి సమాచారంతో రావాలని ఎంపీడీవో పేర్కొన్నారు.