KA PAUL:ముగ్గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు: కేఏ పాల్
KA PAUL:ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ (KA PAUL) మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. తనతో ముగ్గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు (brs mla) టచ్లో ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. వారు తమ పార్టీలో చేరతారని.. ఏప్రిల్ 30వ తేదీ వరకు ఆగాలని మీడియా ప్రతినిధులను కోరారు. ఎమ్మెల్యేలను (mla) ప్రలోభాలకు గురిచేశారా అని అడడగా.. 119 మంది ఎమ్మెల్యేలు 15 శాతం వరకు నీతి, నిజాయితీ ఉన్న వారు ఉంటారని పేర్కొన్నారు.
KA PAUL:ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ (KA PAUL) మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. సీఎం కేసీఆర్ను (kcr) ప్రజలు వచ్చే ఎన్నికల్లో ఓడిస్తారని తెలిపారు. బడుగు, బలహీన వర్గాలకే అధికారం అని స్పష్టంచేశారు. తనతో ముగ్గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు (brs mla) టచ్లో ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. వారు తమ పార్టీలో చేరతారని.. ఏప్రిల్ 30వ తేదీ వరకు ఆగాలని మీడియా ప్రతినిధులను కోరారు. ఎమ్మెల్యేలను (mla) ప్రలోభాలకు గురిచేశారా అని అడడగా.. 119 మంది ఎమ్మెల్యేలు 15 శాతం వరకు నీతి, నిజాయితీ ఉన్న వారు ఉంటారని పేర్కొన్నారు. తమ పార్టీలో ఐఏఎస్ (ias), ఐపీఎస్ (ips) చేరారని.. ప్రొఫెసర్స్, డాక్టర్స్ కూడా చేరారని గుర్తుచేశారు.
అంబేద్కర్ జయంతి (ambedkar) రోజున సచివాలయం ప్రారంభించాలని మరోసారి స్పష్టంచేశారు. ఈ నెల 17వ తేదీన కేసీఆర్ (kcr) జన్మదినం రోజున ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం అనుకుంది. ఎమ్మెల్సీ ఎన్నిక కోడ్ (mlc election code) నేపథ్యంలో వాయిదా వేసింది. తన వల్లే ప్రభుత్వం వెనక్కి తగ్గిందని చెబుతున్నారు. తన ఢిల్లీ పర్యటన (delhi tour) గురించి చెప్పేందుకు నిరాకరించారు. మరికొందరు ప్రముఖులను కలువాల్సి ఉందన్నారు. తెలంగాణలో బడుగులు అధికారం దక్కుతుందని.. ఆ తర్వాత కేంద్రంలో కూడా అధికారం దక్కించుకుంటామని తెలిపారు.
ఏ విషయంలో అయినా సరే తగ్గేదేలే అని కేఏ పాల్ స్పష్టంచేశారు. తన పార్టీ గుర్తు అంశం హైకోర్టు (high court) పరిధిలో ఉందని స్పష్టంచేశారు. ఇప్పటికే మూడు అంశాల్లో తనకు అనుకూలంగా తీర్పు వచ్చిందని చెప్పారు. పార్టీ గుర్తు విషయంలో కూడా అదే జరుగుతుందన్నారు. కామారెడ్డి రైతులకు (kamareddy farmers) న్యాయం జరిగిందని, సచివాలయం అంటూ చెప్పుకొచ్చారు.
బీజేపీని (bjp) చిత్తుగా ఓడిస్తామని కేఏ పాల్ స్పష్టంచేశారు. దేశాన్ని అప్పుల కుప్పగా మార్చింది మోడీ అని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు 56 లక్షల కోట్ల అప్పు చేస్తే.. మోడీ (modi) దానికి రెట్టింపు చేశారని అన్నారు. 8 ఏళ్లలో 118 లక్షల కోట్ల అప్పు చేశారని గుర్తుచేశారు. అదానీ వెనక మోడీ ఉన్నారని విమర్శించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మెస్తే ఆపి వేశానని పేర్కొన్నారు. ఇదే విషయంపై ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షాను కలిసి కోరానని చెప్పారు.