NRML: దిలావర్పూర్ మండల కేంద్రంలోని అయినా ఎల్లమ్మ ఆలయంలో గురువారం నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభించారు. వేద పండితులు నరేష్ శర్మ అమ్మవారిని శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా అలంకరించి ప్రత్యేక పూజలు నైవేద్యాలు సమర్పించారు. వేద పండితుల ఆధ్వర్యంలో పలువురు భక్తులు మాలాధారణ చేపట్టారు. దీక్షా సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు నియమ నిబంధనలను భక్తులకు వివరించారు.