VKB: HMDA పరిధి ప్రస్తుతం 10,472 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండగా, దీనిని మరింత విస్తరించాలని తెలంగాణ రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయించింది. వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలంలోని చిట్టిగూడ, యావాపూర్ గ్రామాలు, మొయినాబాద్ మండల పరిధిలోని టేకులపల్లి, ఎక్తాలా గ్రామాలను హెచ్ఎండీఏ పరిధిలోకి కొత్తగా చేర్చనున్నట్లు వెల్లడించింది.