BPT: చేపల పునరుత్పత్తి కోసం 61 రోజులపాటు అమలు చేయనున్న వేట నిషేధం మంగళవారం అర్ధరాత్రి నుంచి అమలులోకి వచ్చింది. తూర్పు తీర భారత ప్రాదేశిక జలాల్లో జూన్ 15 వరకు ఈ నిషేధం అమలులో ఉంటుంది. సముద్రంలో మత్స్య సంపద వృద్ధి, పరిరక్షణ, నిర్వహణకై ఏటా క్రమం తప్పకుండా ఈ నిషేధాన్ని అమలు చేస్తున్నారు.