NRML: నర్సాపూర్ జి మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్మికులకు మండలంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీవో తిరుపతి రెడ్డి మాట్లాడుతూ.. ప్రతినిత్యం ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటంలో ముందుంటూ గ్రామాలను పరిశుభ్రంగా ఉంచే కార్మికులు ఆరోగ్యంగా ఉండాలని ఉద్దేశంతో వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగిందని తెలిపారు.