NDL: సంజామల మండల కేంద్రంలోని పాలేరు వాగుకు ఇటీవల కురిసిన వర్షాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. వరద ఉద్ధృతి క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే వాగుకు భారీగా వరద నీరు పొటేత్తగా, ప్రస్తుతం నీటి ప్రవాహం రోడ్డుపై నుంచి క్షేత్రస్థాయిలో కొనసాగుతోంది. దీంతో పరిసర ప్రాంతంలోని రైతుల పంట పొలాలు నీటమునిగాయి. అటు, సంజామల-కొత్తపల్లె వెళ్లే రహదారి బ్లాక్ అయింది.