KS Bhart : టీమిండియాలో తెలుగు కుర్రాడికి చోటు…. ట్వీట్ చేసిన జగన్..!
Telugu boy got a chance in Team India. టీమిండియాలో తెలుగు కుర్రాడికి చోటు దక్కించుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ కి చెందిన కేఎస్ భరత్ కి టీమిండియాలో చోటు దక్కించుకోవడం పట్ల ఆమె తల్లి సంతోషం వ్యక్తం చేశారు.
Telugu boy got a chance in Team India. టీమిండియాలో తెలుగు కుర్రాడికి చోటు దక్కించుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ కి చెందిన కేఎస్ భరత్ కి టీమిండియాలో చోటు దక్కించుకోవడం పట్ల ఆమె తల్లి సంతోషం వ్యక్తం చేశారు. చాలా ఎమోషనల్ గా మారి… కుమారుడిని ముద్దాడింది. ఈ సంఘటన నాగపూర్ గ్రౌండ్ లో చోటుచేసుకోగా…. ఈ ఘటన పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్పందించారు. ఈరోజే కేఎస్ భరత్ తన కెరీర్ మొదలుపెడుతున్నాడని…బెస్ట్ విషెస్ తెలియజేశారు. టీమిండియా తరఫున రాణించాలని ఆకాంక్షించారు. తెలుగు ఖ్యాతిని భరత్ ఇనుమడింపజేశారని ప్రశంసించారు. ఆ ఫోటో లో కేఎస్ భరత్ ని అతని తల్లి ముద్దాడుతూ కనిపించడం విశేషం.
కాగా…. ఏడాదిన్నరగా జట్టులో ఉంటున్నా బెంచ్ కే పరిమితమైన ఆంధ్రా క్రికెటర్ కేఎస్ భరత్.. ఎట్టకేలకు బోర్డర్- గావస్కర్ ట్రోఫీతో అంతర్జాతీయ క్రికెట్ లో అరంగేట్రం చేశాడు. భారత్- ఆస్ట్రేలియా తొలి మ్యాచ్ లో భరత్ కు స్థానం లభించింది. రంజీల్లో నిలకడగా రాణించిన భరత్ అంతర్జాతీయ మ్యాచ్ లోనూ అదే ప్రదర్శన కొనసాగించాలని కోరుకుంటున్నాడు.
స్వదేశంలో ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్ లో టెస్ట్ క్యాప్ అందుకున్న కేఎస్ భరత్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. సహచరుల అభినందనలతో టీమిండియా క్యాప్ అందుకుని ఉద్వేగానికి గురయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో బీసీసీఐ ట్విట్టర్ లో షేర్ చేసింది. వికెట్ కీపర్ గా భరత్ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు.