ELR: పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి కమీషనర్ విఆర్ కృష్ణ తేజను వారి కార్యాలయంలో శుక్రవారం పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కలిశారు. పోలవరం నియోజకవర్గ పంచాయతీ నిధుల పై వారితో చర్చించారు. ప్రతి పంచాయతీ అభివృద్ధికి కృషి చేయాలన్న గొప్ప సంకల్పంతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉన్నారని తెలిపారు. పోలవరం నియోజకవర్గం పై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.