AP:ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా తెరకెక్కిన దేవర సినిమా ఇవాళ విడుదలైంది. ఈ సినిమా బెనిఫిట్ షోలో ఎన్టీఆర్ అభిమానులు పలుచోట్ల రచ్చ రచ్చ చేశారు. టికెట్లు లేకుండానే కడపలోని రాజా థియేటర్లోకి ఒక్కసారిగా దూసుకొచ్చారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పిరిస్థితి ఏర్పడింది. దీంతో పోలీసులు అభిమానులను చెదరగొట్టారు. మరోవైపు ప్రకాశంలోని యర్రగొండపాలెం లక్ష్మీ వెంకటేశ్వర థియేటర్లో కూడా ఫ్యాన్స్ కొట్టుకోవడంతో ఒకరికి గాయాలయ్యాయి.