MHBD: ప్రజలకు సత్వర సేవలు అందించడంలో రాష్ట్ర వ్యాప్తంగా మహబూబాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్కు తొమ్మిదో స్థానం దక్కింది. ఈ సందర్భంగా బుధవారం డీజీపీ జితేందర్ చేతుల మీదుగా మహబూబాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ ఎచ్ ఓ దీపిక అవార్డు అందుకున్నారు. దీపిక మాట్లాడుతూ.. ఈ అవార్డుతో బాధ్యతలు మరింత పెరిగాయన్నారు. అనంతరం వారికి పలువురు శుభాకాంక్షలు తెలిపారు.