రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా నటిస్తోన్న ‘గేమ్ ఛేంజర్’ నుంచి అప్డేట్ వచ్చేసింది. ఈ మూవీ నుంచి ‘రా మచ్చ మచ్చ’ అంటూ సాగే రెండో పాట ప్రోమోను ఈ నెల 28న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు పోస్టర్ షేర్ చేశారు. ఇక ఈ సినిమా నుంచి విడుదలైన ‘జరగండి’ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. కాగా, ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు.