పెళ్లి పేరుతో తనపై అత్యాచారానికి పాల్పడ్డారని బిగ్బాస్ OTT కంటెస్టెంట్ ఫిర్యాదుతో ప్రముఖ యూట్యూబర్ హర్షసాయిపై రేప్ కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసుపై హర్షసాయి స్పందిస్తూ ఇన్ స్టాలో పోస్ట్ పెట్టాడు. డబ్బు కోసం తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ తెలిపాడు. తన గురించి అభిమానులకు తెలుసు అని.. త్వరలోనే అన్ని నిజాలు బయటకు వస్తాయన్నాడు. ఈ కేసుపై ఎలా ముందుకెళ్లాలనే దానిపై తన లాయర్ పనిచేస్తున్నారన్నాడు.